సదరం శిబిరాలను నిర్వహించాలి
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:27 AM
జిల్లా లో క్రమం తప్పకుండా సదరం శిబిరాలను నిర్వహించ డంతో పాటు ఆన్‌లైన్ చేసుకున్న వారందరికి సమాచారం ఇవ్వాలని సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో క్రమం తప్పకుండా సదరం శిబిరాలను నిర్వహించ డంతో పాటు ఆన్‌లైన్ చేసుకున్న వారందరికి సమాచారం ఇవ్వాలని సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ ఆదేశించారు. కలె క్టరేట్‌లో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరా బాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్ సదరం శిబిరా లతో పాటు ఆసుపత్రుల్లో పరీక్షల కేంద్రాలల్లో వసతులపై ఇన్‌చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌తోపాటు జిల్లా అధికారు లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడు తూ సదరం శిబిరాలు క్రమంతప్పకుండా నిర్వహించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న వారందరికి సమాచా రం అందించి వారందరూ శిబిరాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్‌లను అందించేలా చూడాలని ఆదేశించారు. అన్ని వైద్య కళాశాలలు, ఆసు పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. భవనాలు, పర్నిచర్, ఇతర సౌకర్యాలు కోసం నిధులు ప్రభుత్వం మంజూరుచేస్తుందని అధికారులు ఏర్పా ట్లు పూర్తిచేయాలన్నారు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం అవసర మైన వైద్యులను నియమించుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో దరఖా స్తులు చేసుకున్నవారందరికి వెంటనే నిర్ధారణ శిబిరాలను నిర్వహిం చాలని అదేశించారు. వైకల్య నిర్ధారణ పరీక్షలు, యూడీ ఐడీ కార్డుల జారీలో రాజన్న సిరిసిల్ల జిల్లా రెండవ స్థానంలో ఉందన్నారు.
జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తాం..
ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా వైకల్య నిర్ధారణ పరీక్ష కేంద్రా ల్లో వసతులు కల్పిస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. శిబిరాల సమాచారం దరఖాస్తుదారులకు చేరవేస్తామని వివరించారు. అప్లికేషన్‌లను పెండింగ్‌లో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీ వో శేషాద్రి, అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్, జీజీహెచ్ సూపరింటెండెం ట్ డాక్టర్ ప్రవీణ్, డీసీఎం వంగ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.