Share News

కుంటయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండ..

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:40 AM

తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ మాజీ ఎంపీటీసీ కరకవేణి కుంటయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

కుంటయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండ..

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ మాజీ ఎంపీటీసీ కరకవేణి కుంటయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్యకు పాల్పడగా బుధవారం ఉదయం సిరిసిల్లకు కేటీఆర్‌ హుటాహుటిన చేరుకొని సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కుంటయ్య పార్థివదేహంపై పూలమాల వేసి కేటీఆర్‌ నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుంటయ్య కుటుంబం సభ్యులను కేటీఆర్‌ పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా విలేకరు లతో కేటీఆర్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో కుంటయ్య నిబద్ధతగల నాయ కుడిగా, నిఖార్సైన గులాబీ సైనికుడిగా పని చేశాడని అన్నారు. ఈ ఆపద సమ యంలో కుంటయ్య కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని అన్నారు. కుంటయ్య ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, కుంటయ్య పెద్దక ర్మ జరిగేదాక బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకత్వం అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటుందన్నారు. కుంటయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామని అన్నారు. కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేయ డంతో పాటు ఆ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. కుంట య్య కుటుంబాన్ని పరామార్శించిన వారిలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ ఎమ్మెల్యే సుంక రవి శంకర్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ జిల్లా, మండల అధ్యక్షులు, నాయకులు ఉన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:40 AM