రజతోత్సవ సభకు భారీగా తరలిన బీఆర్‌ఎస్ శ్రేణులు
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:05 AM
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చింతకుంటలోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చింతకుంటలోని పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రజతోత్సవ సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీగా బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ పతాకాన్ని చేతబూని బస్సుపై కూర్చుని ర్యాలీగా రజతోత్సవ సభకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ వాతావరణంలో సభకు తరలివెళ్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్‌ఎస్ అని, కరీంనగర్ నియోజకవర్గం నుంచి 200 బస్సుల్లో ప్రజలు జాతరలాగా సభకు తరలివస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
కరీంనగర్ రూరల్,: కరీంనగర్ మండలంలో అన్ని గ్రామాల్లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బొమ్మకల్ బైపాస్ రోడ్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ పుట్టిన సంవత్సరం ఏప్రిల్ 27, 2001 సంవత్సరంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ర్యాక మోహన్ నిర్మించిన జెండాగద్గెను మాజీ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 25 ఆవిర్బావ దినోత్సవంలో అదే గద్దె వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండాను ఎగుర వేశారు.