Share News

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:42 AM

తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్‌ఎస్‌ పాల న అవినీతి, అక్రమాలతో కూరుకుపోయి రాష్ట్ర ఖజానాను దోచుకుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు.

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్‌ఎస్‌

గంభీరావుపేట, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్‌ఎస్‌ పాల న అవినీతి, అక్రమాలతో కూరుకుపోయి రాష్ట్ర ఖజానాను దోచుకుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు. గంభీరావు పేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివారం విలేఖరులతో కేకే మాట్లాడు తూ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న సొమ్మును స్థానిక సంస్థల ఎన్నికల్లో కుల సంఘాలకు పంచి పెడుతోందన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పంచుతున్న సొమ్ము ప్రజలదేనని, ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపర్చే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాలు అబివృద్ధి చెందుతాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారం టీలను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరంటు, మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, కొత్త రేషన్‌ కార్డులు, సన్న బియ్యం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమా లను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారన్నారు. అందుకే మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులే గెలిచారన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:42 AM