Share News

బీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:40 AM

: జిల్లా కేంద్రంలో బీఆర్‌ ఎస్‌ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో లైవ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను హైదరాబాద్‌లో చేపట్టారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

జగిత్యాల క్రైం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో బీఆర్‌ ఎస్‌ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో లైవ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను హైదరాబాద్‌లో చేపట్టారు. జిల్లా కేంద్రం లోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో లైవ్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను తిలకించేందుకు భారీ స్కీన్‌ను ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు లైవ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తున్న సమ యంలో జగిత్యాల పట్టణంలోని ధరూర్‌ క్యాంపులో ఉన్న బీఆర్‌ఎస్‌ భవన్‌ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాలో సాంకేతిక లోపంతో అంతరాయం ఏర్పడింది. దీంతో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, బీఆర్‌ఎస్‌ నాయకులు విద్యుత్‌ సరఫరా లో అంతరాయాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచి జయ శంకర్‌ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారిపై భైఠాయించి సెల్‌ఫోన్లో లైవ్‌ చూస్తూ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రవి శంకర్‌, వసంతలు మా ట్లాడుతూ ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కరెంటు కట్‌ చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకు లు నాగం భూమయ్య, వొళ్లెం మల్లేశం, ఆనందరావు, అనురాధ, ఆనం దరావు, శ్రీధర్‌రెడ్డి, దేవేందర్‌ నాయక్‌, శివ కేసరిబాబు ఉన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:40 AM