బీసీ రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్‌ఎస్
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:41 PM
రాష్ట్రం లో బీసీల రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్‌ఎస్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే బీఆర్‌ఎస్ బీసీ రాగం అందుకోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి విమర్శించారు.
మందమర్రిటౌన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో బీసీల రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్‌ఎస్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే బీఆర్‌ఎస్ బీసీ రాగం అందుకోవడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. బుధవారం మందమర్రిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ బీసీల కోసం ఏం చేసిందో జవాబు చెప్పాల న్నారు. బీసీలు రాజకీయంగా ఎదిగితే తాము ఎక్కడ దెబ్బతింటామోనని ఆఊసె ఎత్తలేదన్నారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. అనంతరం ఆర్డినెన్స్ జారీ చేసి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపామని వివరించారు. మూడు నెలల్లోగా ఆమోదించకపోతే సుప్రీంకోర్టు తీర్పుప్రకారం చట్టం అవుతుందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- యూరియా కొరత లేదు
రాష్ట్రంలో రైతన్నలు యూరియా కోసం ఆందోళన చెందవద్దని, జిల్లాలో రైతులకు యూరియా అందేలా చూడా లని కలెక్టర్‌తో మాట్లాడానని మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రాని కి యూరియా అందించడంలో కేంద్రం సరిగ్గా స్పందించడం లేదన్నారు. రైతు లకు అండగా నిలవడమే తమ ప్రభు త్వ లక్ష్యమన్నారు. కావాలని కొందరు తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు.
- ఉన్నత విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్థికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉపాధి కల్పన, కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్‌వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణంలోని కార్మెల్ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి మంత్రి అతిథిగా హాజరై కళాశాలను ప్రారంభించారు. అంతకుముందు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ రాష్ట్రంలో పది వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. కార్మెల్ పాఠశాల నిర్వహకులు విద్యాభివృద్ధికి చేస్తున్న సేవలు గొప్పవన్నారు. మంత్రిని నిర్వహకులు ఘనంగా సన్మా నించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు జేవీఆర్ రెక్స్, ఉపాధ్యాయులు, విద్యార్థు లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.