ప్రజాపాలనను చూసి ఓర్వలేకపోతున్న బీఆర్‌ఎస్
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:49 AM
తెలంగాణలో ప్రజాపాలనను చూసి బీఆర్‌ఎస్ పార్టీ విషం కక్కుతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనిమేని చక్రధర్‌రెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో ప్రజాపాలనను చూసి బీఆర్‌ఎస్ పార్టీ విషం కక్కుతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కనిమేని చక్రధర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో చక్రధర్‌రెడ్డి మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్ని కల్లో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని బలపరిచాలని, మేనిఫె స్టోలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ పది సంవత్సరాల నిరంకుశపాలన దోపిడీకి వ్యతిరే కంగా ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. 20 నెలల కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అధికార దాహం, దుర్బుద్ధితో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకొని పనికిరాని ప్రాజెక్టులను నిర్మించి ప్రజలపై పెనుభారం మోపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక్కొక్కటి గా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేయడం వల్లే ప్రతిపక్షంలో కూర్చుందని ఎద్దేవా చేశారు. తెలంగాణను ఆర్థికంగా కేసీఆర్ దివాలా తీయించడంవల్లే ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఇబ్బంది పడుతున్నాడన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత, తీన్మార్ మల్లన్న ధన్యవాదాలు చెప్పకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దాడులు, విమర్శలు చేసుకోవడం విడ్డూరం గా ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, నాయకులు సత్తు శ్రీనివాస్‌రెడ్డి, ఈగల తిరుపతి, కే శ్రీనివాస్‌రెడ్డి పొన్నం లక్ష్మన్‌గౌడ్, అన్నల్‌దాస్ భాను, వంగరి దత్తు, సామల బాబు, మధుసూధన్‌రెడ్డి, దుర్గయ్య, కనకయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.