Share News

యూరియా అందించాలని బీఆర్‌ఎస్‌ ధర్నా

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:17 AM

రైతులకు యూరియా అందించాలని కోరుతూ శనివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గంగాధర ప్రఽధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారన్నారు.

యూరియా అందించాలని బీఆర్‌ఎస్‌ ధర్నా

గంగాధర/చిగురుమామిడి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు యూరియా అందించాలని కోరుతూ శనివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో గంగాధర ప్రఽధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారన్నారు. రైతులకు సాగునీరు, ఎరువులు అందక కష్టాలు పడుతున్నారన్నారు. రోడ్డుపై ధర్నాకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిగురుమామిడి మండలం కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్యూలో ఉండా బేజారవుతున్నారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, మండల రైతు సమన్వయ మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, మాజీ ఎంపిటిసి సబ్యులు కత్తు రమేష్‌ యాదవ్‌, రామోజు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. బొమ్మనపల్లి మాజీ ఎంపీటీసీ రమేష్‌ యాదవ్‌ ఆర్టీసీ బస్సుకు అడ్డుగా పడుకుని నిరసన తెలిపాడు. నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Updated Date - Aug 24 , 2025 | 12:17 AM