బ్రిడ్జి పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:56 AM
బోయినిపల్లి దారిలో స్తంభంపల్లి గ్రామశివారులో బ్రిడ్జి పనులను త్వరగా పూర్తిచేయాలని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.
బోయినపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : బోయినిపల్లి దారిలో స్తంభంపల్లి గ్రామశివారులో బ్రిడ్జి పనులను త్వరగా పూర్తిచేయాలని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోగల స్తంభంపెల్లి గ్రామ శివా రులో అసంపూర్తిగా నిలిచిన బ్రిడ్జి పనులను బుధవారం ఎమ్మెల్యే మేడి పల్లి సత్యంతోపాటు, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాలు కలిసి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకవచ్చేలా చూడాలని సూచించారు. పనులు వేగవంతం చేసి నిరంతరం పర్య వేక్షించా లని పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డిని ఆదేశించారు.
తరగతి గదులు నిర్మించాలి..
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు పరిశీలించారు. పదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబ ట్టారు. కిచెన్ స్టోర్‌రూం, మధ్యాహ్న భోజన తయారీ తీరును పరిశీలించారు. భవనం మొదటి అంతస్తులో రూ.8లక్షలతో రెండు తరగతిగదుల నిర్మాణాని కి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని పంచాయతీ ఈఈని ఆదేశించారు.
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
కొదురుపాక దారిలో ఉన్న రెండులో లెవల్ కల్వర్టులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు పరిశీలించారు. ప్రయాణీకుల ఇబ్బందులు తల్తెకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, వైస్‌చైర్మన్ వినోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల కనుకయ్య, కౌడిగాని వెంక టేశ్ నాగు వంశీ తదితరులు పాల్గొన్నారు.