బో ‘నమో’ పెద్దమ్మ తల్లీ
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:26 AM
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కట్టరాంపూర్, బోయవాడ, భగత్‌నగర్, జ్యోతినగర్‌కు చెందిన ముదిరాజ్ కులస్థులు పెద్ద సంఖ్యలో భగత్‌నగర్ భగత్‌సింగ్ విగ్రహం వద్ద కలసి పెద్దమ్మతల్లి ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ వై సునీల్‌రావు, నాయకులు చొప్పరి జయశ్రీ, ఆకుల నరసయ్య, సంఘ నగర అధ్యక్ష, కార్యదర్శులు కొలకాని నరసయ్య, పండుగ నాగరాజు, పిట్టల లింగయ్య, కంకటి కనకయ్య, వెలవేని నరసయ్య, రాగిల్ల లక్ష్మణ్, గీకురు నారాయణ, పిట్టల మహేందర్, కంకటి శ్రవణ్ కుమార్, పిట్టల కనకచంద్రం, జి కోటేశ్వర్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూల జయపాల్ పాల్గొన్నారు.
ఫ సల్లంగ జూడు పోచమ్మతల్లి...
మార్కండేయనగర్‌లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాంనగర్, ప్రగతినగర్, సప్తగిరికాలని, మార్కండేయనగర్ ప్రాంతాలకు చెందిన విశ్వబ్రాహ్మణ కులస్థులు పోచమ్మతల్లి బోనాల జాతర నిర్వహించారు. బైపాస్‌రోడ్ పోచమ్మతల్లి ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో వేణుగోపాలాచారి, లక్ష్మయ, పాములపర్తి శ్రీనివాసాచారి, కళికోట శ్రీనివాస్, శివప్రసాద్, కె శ్రీనివాస్, పి ఆంజనేయులు, పి కళాధర్, కె ఆనందం, రామస్వామి, శ్రీనివాస్, రాంప్రసాద్, దీక్షిత్, దీపక్ పాల్గొన్నారు.
ఫ మైసమ్మతల్లికి..
ఆదర్శనగర్‌లో శ్రీరాజరాజేశ్వరస్వామి అభయాంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మైసమ్మతల్లి బోనాల జాతర నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజన్‌కుమార్, కమిటీ బాధ్యులు మెతుకు కనకయ్య, భూమ్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, జగ్గారెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు.