సన్న బియ్యంపై బీజేపీ రాజకీయం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:25 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై బీజేపీ నాయకులు కావాలని రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ మండిపడ్డారు.

రుద్రంగి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై బీజేపీ నాయకులు కావాలని రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ మండిపడ్డారు. రుద్రంగి మండల కేంద్రంలో డీసీఎమ్‌ఎస్, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టి సన్నం బియ్యం తాము పంపీణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుం టున్నారని, బీజేపీ వారు పంపిణీ చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సన్నం బియ్యం పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల సంక్షమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని, రైతులు పండిం చిన పంటలకు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుం దన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్నారు. సన్నపు వడ్లకు క్వింటాల్‌కు 500రూపాయల బోనస్ అంది స్తున్నామన్నారు. వడగండ్ల వర్షలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేలు నష్టపరిహారం అంది స్తున్నట్లు గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, తహసీల్దార్ శ్రీలత, ఏంపీడీవో నటరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూం జలపతి, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ, మాడిశేట్టి ప్రభాకర్, గడ్డం స్వామి, పల్లి గంగాదర్, తర్రె లింగం, ఎర్రం రాజలింగం, సిరికొండ రవి, స్వర్గం పరందామ్, అల్లూరి సంతోష్‌రెడ్డి, సూర యాదయ్య, గంధం మనోజ్, పడాల శ్రీనివాస్, పూదరి మహిపాల్, గుగ్గిళ్ల వేంకటేశం, దసారి గంగారాజం, తదితరులు పాల్గొన్నారు.