బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:16 AM
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తున్నది సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రానికే నష్ట వాటిల్లుతుందని, ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు.
భగత్‌నగర్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తున్నది సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గురువారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రాష్ట్రానికే నష్ట వాటిల్లుతుందని, ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఐ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపి కేంద్రంలో బిల్లును అడ్డుకోవడం ఆ పార్టీ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. రిజర్వేషన్ల సమస్యను సాధ్యమైనంత తొందరగా ఓ కొలిక్కి తీసుకువచ్చి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ఎల్‌ఎండీ ఆనకట్ట వద్ద ముప్పై సంవత్సరాలుగా నివాసముంటున్న పేదల ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నాయంటూ ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇళ్లను కూల్చే ఆలోచనను ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఇళ్లు కూలుస్తామంటే సీపీఐ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. తక్షణమే నోటీసులను వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్‌కుమార్, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, ఎఐఎఎస్‌ఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు మణికంఠరెడ్డి, బండ రాజిరెడ్డి, బ్రామండ్లపల్లి యుగేందర్, మచ్చ రమేష్ పాల్గొన్నారు.