రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్రను ప్రతిఘటించాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:11 AM
రాజ్యాంగ రద్దుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ ఎస్‌ఎస్ కలిసి చేస్తున్న కుట్రలను ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌బాబు అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగ రద్దుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ ఎస్‌ఎస్ కలిసి చేస్తున్న కుట్రలను ప్రతిఘటించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్‌బాబు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు అధ్యక్షతన రెండవ మహాసభలు జరగాయి. ముఖ్యఅతిథి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ హిందుత్వ ని యంతృత్వ ఎజెండా అమలును కార్మిక, కర్షకశక్తులతో కలిసి సామాజిక శక్తులు అడ్డకోవాలని చేప్పారు. సనా తన ధర్మం ముసుగులో మనువాద భావజాలాన్ని ఆర్ ఎస్‌ఎస్, బీజేపీ, హిందూత్వ శక్తులు పథకం ప్రకారం మందుకు తీసుకొస్తున్నాయని, దాన్ని సామాజిక శక్తు లు అడ్డుకోవాలన్నారు. బీజేపీ తన రాజ్యాంగ వ్యతిరేక స్వభావానిలతో పార్లమెంట్ సాక్షిగా హోంమంత్రి అమి త్‌షా అంబేద్కర్‌ను అవమానిస్తూ చేసిన వ్యాఖలు దే శం మరవదన్నారు. ప్రజాస్వామ్యం సామాజిక న్యాయ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి ఆహార సబ్సిడీకి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి పూర్తి స్థాయి లో నిధుల కోత విధించి అట్టడుగు వర్గాలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ విధానలపై దేశవ్యాప్త పోరాటాలకు కేవీపీఎస్ సామాజిక శక్తులను కలుపుకొ ని పోరాడుతుందన్నారు. బతుకమ్మ, దసరా ఉత్సవాల లో కుల వివక్ష అంటారానితనం కొనసాగితే సహించేది లేదన్నారు. సామాజి మాధ్యమాలలో మహనీయుల లక్ష్యాలు ఆశయాలను కుల ని ర్మూలన లక్ష్యలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి తిప్పారపు సురేష్ మా ట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం జస్టిస్ పున్నయ్య కమీషన్ ఏర్పాటు చేరుంచి అంటరానిత నం కుల వివక్షత నిర్మూలన కోసం కేవీపీఎస్ నిర్విరామ పోరా టం చేసిందన్నారు. కులాంతర వివాహాల జంటల పెండింగ్ బ కాయిలను ప్రభుత్వం తక్షణమే విడదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రావాల్సిన పరిహారాన్ని విడదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పరిహా రం విడదల చేయాలని డిమాండ్ చేవారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూసం రమే ష్, డివైఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి మల్లారపు అరుణ్, ఐద్వా జిల్లా కార్యదర్శి విమల, వ్యవసాయ కార్మికు సంఘం జిల్లా కార్యదర్శి గన్నెరపు నర్సయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు పాల్గొన్నారు.