Share News

3న కరీంనగర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:19 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లాకు సెప్టెంబరు 3న వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం నిర్వహించారు.

3న కరీంనగర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

భగత్‌నగర్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లాకు సెప్టెంబరు 3న వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ కార్యాలయంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అనంతరం ప్రధాని మోదీ మన్‌కీబాత్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, మాజీ మేయర్‌ సునీల్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేష్‌, కోమల ఆంజనేయులు, ఇనుకొండ నాగేశ్వర్‌ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్‌ బోయిన్పల్లి ప్రవీణ్‌రావు, సీనియర్‌ నాయకులు కన్నబోయిన ఓదెలు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మాడ వెంకట్‌రెడ్డి, గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, ఎండి ముజీబ్‌, దురిశెట్టి సంపత్‌, దూబాల శ్రీనివాస్‌, దండు కొమురయ్య, పుప్పాల రఘు, గుజ్జ శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ కొలగని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:19 AM