స్థానిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధంకావాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:37 PM
స్థానిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.
భగత్‌నగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కరీంనగర్‌కు రానున్నట్లు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సారఽథ్యంలోని ప్రభుత్వంద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధిపనులపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలని, మోసపూరితమైన పాలనపై ప్రజలకు వివరించాలని అన్నారు. సమావేశంలో మాజీ మేయర్ సునీల్‌రావు, బాస సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.