హుజూరాబాద్‌లో బీజేపీ నాయకులను గెలిపించుకుంటా
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:06 AM
హుజూరాబాద్ నియోజకవర్గానికి తనకు 25ఏళ్ల అనుబంధం ఉందని.. నేను కొత్తగా రాలేదని, ఇక్కడి బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు
ఫహుజూరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ నియోజకవర్గానికి తనకు 25ఏళ్ల అనుబంధం ఉందని.. నేను కొత్తగా రాలేదని, ఇక్కడి బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో బీజేపీలోకి వచ్చిన తర్వాత మొదటి సారి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని, అందరిని గెలిపిం చుకునే బాధ్యత తనదన్నారు. నాకు పదవుల కంటే ప్రజలు ముఖ్యమని, ఆపదలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీసీ రిజర్వేషన్లపై రాజ్యాం గ నిపుణులు ముందే చెప్పినా పట్టించుకోకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించారన్నారు. తెలంగాణలో 85శాతం బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ మొదటి నుంచి పోరాడుతుందన్నారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో బీజేపీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపిందన్నారు. 50ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో ముర్ఖంగా వ్యవహరించిందన్నారు. చేసిన తప్పునకు కాంగ్రెస్ పార్టీ చెంపలు వేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి, ఎన్నికలు జరిపించాలన్నారు. గతంలో పనిచేసిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు, జడ్పీ టీసీలు, ఎంపీటీసీలకు ఇప్పటి వరకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత సంవత్సరం యాసంగిలో కొనుగోలు చేసిన సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కేంద్రలో 27శాతం బీసీ మంత్రులు ఉన్న ఏకైక ప్రభుత్వం మోదీదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, డాక్టర్ కాళి ప్రసాద్, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్, జ్యోత్స్న, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.