Share News

కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తున్న బీజేపీ

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:19 AM

దేశ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ శక్తులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తున్న బీజేపీ

భగత్‌నగర్‌, జులై 5(ఆంధ్రజ్యోతి): దేశ సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌ శక్తులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఆయన విలేకరులతో శనివారం మాట్లాడారు. నీతివంతమైన పరిపాలన అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ అవినీతికి ఆజ్యం పోస్తున్నాడన్నారు. విదేశాల్లో ఉన్న అవినీతి పరులను స్వదేశానికి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్రం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. గత ప్రభుత్వం తీసుకుకొచ్చిన ధరణి పోర్టల్‌తో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చి రైతుల కష్టాలు తీరుస్తామని చెబుతున్నారని, మాటల్లో కాదు చేతల్లో చూపాలన్నారు. చట్టాల్లో అనేక లొసుగులు ఉన్నాయని వాటిని ప్రక్షాళన చేయాలన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌, కార్యవర్గ, కౌన్సిల్‌ సభ్యులు బోయిని అశోక్‌, కసిరెడ్డి సురేందర్‌ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్లపల్లి యుగేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:20 AM