బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం..
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:47 AM
బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు విమర్శించా రు.
సిరిసిల్ల రూరల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ వ్యతిరేకమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు విమర్శించా రు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యడు ఎగుమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ సిరి సిల్లలో లక్షలాది మంది కార్మికులకు ఉచిత వైద్యం అందించేందుకు మంజూరైన ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పందించి ప్రజలకు జవా బు చేప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమార్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలే కానీ జిల్లా ప్రజల సమస్యలు పరిష్కారంపై శ్రద్ధ చూప డం లేదన్నారు. బీసీ బిల్లు విషయంలో బీజేపీ బల హీన వర్గాలకు బద్ధశత్రువుగా వ్యవహరిస్తోందన్నా రు. బలహీన వర్గాలపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలని డి మాండ్ చేశారు. జిల్లాలో రైతాంగానికి యూరియా కొరత ఏర్పడిందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పరస్పర ఆరోపణలతో సమస్య పరిష్కారం చే యకుండా పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పెండింగ్ బిల్లులను తక్షణ మే విడుదల చేయాలన్నారు. సిరిసిల్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరతను సృష్టించి లబ్ధిదా రులను ఇబ్బందులు పెడుతున్నారని,అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారని అరోపించారు. జిల్లాలో 16ముంపు గ్రామాల ప్రజలు కలిసి మౌలిక సమస్య లు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించి ఉపాధిని కల్పించా లని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిరిసిల్లలో వర్కర్ టూ ఓనర్ పఽథకానికి మోక్షం ఎప్పుడని ప్రశ్నించా రు. జిల్లాలో 8,800ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశా రని, అందులో 5వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వాటికి నిఽధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం అధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వేలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివ్వాజి విమల, కోడం రమణ, మల్లారపు అరుణ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ, మాల్లారపు ప్రశాంత్, గురజాల శ్రీధ ర్, శ్రీరాముల రమేష్‌చంద్ర, ప్రజా సంఘాల నాయ కులు గాంతుల మహేష్, నక్క దేవదాస్, గుండేటి పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.