Share News

సాయుధ పోరాటంపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదు

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:03 AM

తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా మండలశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం అమరుల స్తూపాల వద్ద ఆయన జెండా ఆవిష్కరించారు

సాయుధ పోరాటంపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదు
ఇందుర్తిలో అమరవీరుల స్థూపం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న చాడ వెంకట్‌రెడ్డి

చిగురుమామిడి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా మండలశాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం అమరుల స్తూపాల వద్ద ఆయన జెండా ఆవిష్కరించారు. అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టుల పోరాటంతోనే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైందన్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, నాయకులు గూడెం లక్ష్మి, బోయిని అశోక్‌, బాబు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:03 AM