బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల కపట ప్రేమ
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:42 AM
బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలవి కపట ప్రేమ అని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేంద ర్‌రెడ్డి ఆరోపించారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : బీసీలపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలవి కపట ప్రేమ అని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేంద ర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడారు. కామారెడ్డి డిక్లరే షన్‌లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పామన్నారు. దేశంలో ఎవరు చేయని సాహాసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొన్న ఖర్గే, రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కులగణన చేపట్టి శాస్త్రీయంగా అసెంబ్లీలో ఏకకం ఠంతో ఆమోదింప చేశారన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ ఏకకంఠంతో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్‌లో ఆమోదం కోసం రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్‌ను పొందుపరచి పంపించారన్నారు. సమైఖ్య రాష్ట్రంలో బీసీల కు ఎక్కువ రిజర్వేషన్లు ఉండేవని సుప్రీం కోర్టు 50శాతం మించి ఉండకూడదన డంతో తెలంగాణ వచ్చాక బీసీల రిజర్వేషన్లను 23శాతంకు కుదించబడిందన్నారు. అటువంటి పరిస్థితి ఎదురుపడవద్దని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూలో పొందుపరిచి కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపారన్నారు. బండి సంజయ్, ఆర వింద్‌కుమార్ బీసీలం అంటూనే బీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నారని, దీనిబట్టి బీసీల పట్ల బీజేపీకి ప్రేమలేదని చెప్పవచ్చునన్నారు. బీసీ అని చెప్పుకుంటూ 12 సంవ త్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఆహ్వా నించాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై మోదీపై ఇక్కడి బీజేపీ ఎంపీలు, ఎ మ్మెల్యేలు, నాయకులు ఎత్తిడిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పట్ట ణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరా జు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, మార్కెట్ కమిటి డైరెక్టర్ దుబాల వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు వేముల రవి, కత్తెర దేవదాస్, రెడ్యానాయక్, రాగుల జగన్, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరెళ్ళ శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.