పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలి
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:12 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు.
ఇల్లందకుంట, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్‌తో పాటు ఇతర రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రక్తపోటు, షుగర్ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మందులను వాడుకోవాలన్నారు. ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులోని మహిళల రీస్ర్కీనింగ్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. రెఫెరల్ కేసులను ఫాలోఆప్ చేస్తూ వారికి అవగాహన కలిగించాలన్నారు. సిజేరియన్ వల్ల కలిగే సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు. సాధారణ ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగేటట్లు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, మండల వైద్యాధికారి డాక్టర్ మధుకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.