Share News

ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:25 AM

గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా జయంతి వేడుకలను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఘనంగా బిర్సా ముండా జయంతి వేడుకలు

సిరిసిల్ల, నవంబరు 15(ఆంధ్రజ్యోతి) : గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా జయంతి వేడుకలను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహిం చగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ హాజ రై జ్యోతి ప్రజ్వలన చేసి, బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా అని ఇన్‌చార్జి కలెక్టర్‌ కొనియాడారు. డీటీడబ్ల్యూవో సంగీత, ఏవో రాంరెడ్డి, డీఎం డబ్ల్యూవో భారతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ స్వప్న, ఎల్డీ ఎం మల్లికార్జునరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 12:25 AM