గజసింగవరంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:50 AM
గంభీరావుపేట మండలం గజసింగవ రం ప్రభుత్వ పాఠశాలలో చదవుతున్న పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు సీఎస్‌ఆర్ నిధులతో మోడీ గిప్ట్ కానుకగా 30 సైకిళ్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు.
గంభీరావుపేట, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): గంభీరావుపేట మండలం గజసింగవ రం ప్రభుత్వ పాఠశాలలో చదవుతున్న పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు సీఎస్‌ఆర్ నిధులతో మోడీ గిప్ట్ కానుకగా 30 సైకిళ్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా పార్ల మెంటు పరిధిలో పదో తరగతి చదవుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు 20వేల సైకిళ్లను పంపిణీ చేశామని గోపి వెల్లడించారు. విద్యార్థులు కాలినడకన వెళ్లడం వల్ల బడికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో ఉచితంగా సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగారాం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, బీజేపీ మండల అధ్య క్షుడు కోడె రమేష్, మాజీ అధ్యక్షుడు గంట అశోక్, ముస్తా బాద్ మండల అధ్యక్షుడు క్రాంతికుమార్, మండల ప్రధాన కార్యదర్శులు విగ్నేష్‌గౌడ్, మల్లేశ్‌యాదవ్, నాయకులు సత్య నారాయణ, రాజిరెడ్డి, సర్వొత్తం, నాగరాజుగౌడ్, ఎలెందర్, రవీందర్, ప్రసాద్, మహేష్, బాలరాజు, సుదాకర్, రాజు, నరేష్, సంతోస్, దేవగౌడ్, సంజయ్, బాలకృష్ణ, మధు, నవీన్, చారీ తదితరులు ఉన్నారు.