Share News

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:08 AM

భూ భారతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ సూచించారు. ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ధర్మపురి, అక్టోబరు 17 ( ఆంధ్రజ్యోతి ): భూ భారతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ సూచించారు. ధర్మపురి మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ రికార్డులు, భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తును జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ సేవ సర్టిఫికెట్లను పెండింగ్‌ లేకుండా ఎప్పకటికప్పుడు పూర్తి చేయాలని, సర్టిఫికెట్లు ప్రజలకు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునఃనిర్మాణ పనులకు సంబంధించిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట జగిత్యాల ఆర్‌డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ ఏరుకొండ శ్రీనివాస్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- కేజీబీవీ తనిఖీ..

ధర్మపురి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్య, విద్యల పట్ల శ్రద్ద చూపించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం భోజనం నిర్వహణను, వంట సరుకుల నాణ్యతను, స్టోర్‌ రూమ్‌లో గల బియ్యం నాణ్యతను పరిశీలించారు. వంట నిర్వాహకులను ప్రభుత్వ ఆదేశానుసారంగా మోనూ ప్రకారం, శుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు వండి వడ్డించాలని ఆయన సూచించారు. పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. విద్యాలయం చుట్టు ఉన్న పరిసరాలన పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన తీరు పట్ల కొన్ని విషయాలను తెలుసుకుని ఉపాధ్యాయుకలు తగు సూచనలు అందించారు. ఆయన వెంట జగిత్యాల ఆర్‌డీవో మదుసూధన్‌, డీఈవో రాము, ధర్మపురి మండల తహసీల్దార్‌ ఏరుకొండ శ్రీనివాస్‌, ఎంఈవో సీతాలక్ష్మి, ప్రత్యేక అధికారి అరుణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:08 AM