భూ భారతి చట్టం.. మీ ఇంటి చుట్టం
ABN , Publish Date - May 21 , 2025 | 01:17 AM
గతంలో నలుగురు నాలుగు గోడల మధ్యన కూర్చుని ధరణి చట్టాన్ని తీసుక వచ్చినట్లు కాకుండా, 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మీ ఇంటి చుట్టంలా భూభారతి చట్టాన్ని తీసు కవచ్చామని, రాబోయే రోజుల్లో సాదాబైనామాలను పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి అన్నారు.
పెద్దపల్లి/ఎలిగేడు, మే 20 (ఆంధ్రజ్యోతి): గతంలో నలుగురు నాలుగు గోడల మధ్యన కూర్చుని ధరణి చట్టాన్ని తీసుక వచ్చినట్లు కాకుండా, 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి మీ ఇంటి చుట్టంలా భూభారతి చట్టాన్ని తీసు కవచ్చామని, రాబోయే రోజుల్లో సాదాబైనామాలను పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎలిగేడు మండలం ముప్పిరితోటలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకవచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే భూభా రతి చట్టంపై అధ్యయనం చేశామని, ప్రజలు మెచ్చే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకవచ్చి ఏప్రిల్ 14న ఆరంభించామన్నారు. ఎలిగేడు మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి మండలంలోని 13 గ్రామాల్లో భూసమస్యలపై 1054 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో కొన్నింటిని పరిష్కరించామని జూన్ 2 వరకు పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ధరణిలో సాదాబైనామాలకు పరిష్కారం చూపకుండానే గత ప్రభుత్వం 9,26,000 దరఖాస్తులు స్వీకరించడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు చెప్పులు అరిగేలా తిరిగారని, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉం దని రాబోయే రోజుల్లో వారి సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరి స్తామని స్ఫష్టం చేశారు. భూములకు భూధార్ కార్డు ఇస్తామని, ఈ నంబర్‌తో ఆన్‌లైన్‌లో భూముల వివరాలు చూసుకోవచ్చని తెలిపారు. గతంలో భూముల రిజిస్ట్రేషన్లకు హద్దులు చూపే వారని, ఇప్పుడు సర్వే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి ఆ మ్యాపులను పాస్ బుక్‌లో జోడిస్తామ న్నారు. ప్రతీ మండలానికి 8 నుంచి 10 మంది రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్‌డ్ ప్రైవేట్ సర్వేయర్లను నియమిస్తామని, వారికి మూడు మాసాల పాటు శిక్షణ ఇస్తామన్నారు. గతంలో మాదిరిగా యేటా డిసెంబర్ 31 వరకు జమాబంధి లెక్కలు చేసే వారని, ఆ విధానాన్ని మళ్లీ తీసుకు వస్తున్నా మన్నారు. ధరణి వల్ల జరిగిన తప్పులను భూభారతి ద్వారా సవరిస్తా మన్నారు. రైతులు కోర్టుల చుట్టూ తిరగకుండా తమ సమస్యల పరి ష్కారానికి తహసీల్దార్లు, ఆర్‌డీఓలు, అదనపు కలెక్టర్లకు అధికారాలను ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ, దేవాదాయ భూములను సర్వే చేసి హద్దులు పెడతామన్నారు. రైతులు కోర్టుల పాలు కాకుండా ఉండేందుకే భూభారతి చట్టాన్ని తీసుకవచ్చామని, గతంలో వలే ధరణిలో సమస్య పరిష్కారానికి వెయ్యి రూపాయల రుసుం తీసుకోమని, రెవెన్యూ అధికారులే ఇళ్ల వద్దకు వచ్చి ఉచితంగా దరఖాస్తు ఫారం ఇస్తారని అన్నారు. భూభారతి చట్టాన్ని సీఎం కోసమో, మంత్రులు, ఎమ్మెల్యేల కోసమో తీసుక రాలేదన్నారు. 18 రాష్ట్రాల్లో అమలవుతున్న రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి ప్రజల ఆలోచన మేరకు చట్టాన్ని తీసుక వచ్చామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 98,654 డబుల్ బెడ్ రూముల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని, 60 వేల ఇళ్లు పూర్తి చేశారని, 30 వేల ఇళ్లు మొండి గోడలుగా దర్శనమిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 4,50,00 ఇళ్లు మంజూరు చేశామని, ఈ నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్నామని, అనేక పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఫ రైతుల భూములను కాపాడేందుకే భూభారతి
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రూపాయి ఖర్చు లేకుండా న్యాయపరంగా రైతుల భూములను కాపాడేందుకు భూభారతి చట్టాన్ని తీసుక వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ యంత్రాంగాన్ని దొంగలుగా చిత్రీకరించారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు. రెవెన్యూ అధికారులు కూడా బాఽధ్యతాయుతంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు తికమక అవుతూ ప్రభుత్వంను బదనాం చేయాలని చూస్తున్నారన్నారు. బీజేపీ వాట్స్‌ఆప్ యూనివర్శిటీలో అన్ని అబద్దాలనే ప్రచారం చేస్తారని విమర్శిం చారు. ఆపరేషన్ సింధూర్‌కు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభు త్వానికి రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారన్నారు. గతంలో ఇందిరా గాంధీ అమెరికా నాయకత్వం ఎదిరించి పాకిస్థాన్‌ను యుద్ధంలో చిత్తు చేసి ప్రత్యేకంగా బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారని, నేడు అమెరికా ఒత్తిడికి తలొగ్గి రాజీపడటం దురదృష్టకరమని మంత్రి తెలిపారు. గతంలో సాగు నీటి కోసం రైతులు పడే ఇబ్బందులపై ముందు ఉండి పోరాటం చేసిన నాయకులు నేడు ప్రజాప్రతినిధిగా ఉండటం సంతోషం గా ఉందన్నారు. ఎస్సారెస్పీ డి- 83, డి-87 కింద పూర్తి స్థాయి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిం చారని అన్నారు. సుల్తానాబాద్, పెద్దపల్లి బైపాస్ రోడ్డు పనులు టెండర్లు పూర్తవుతున్నాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఎమ్మెల్యే పని చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 24 గంటలలోగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యు త్ రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 57 వేల ఖాళీలను సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. గత ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేక పోయిందన్నారు. రైతులకు 2 లక్షల పంట రుణ మాఫీ, సన్న రకం వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయలు బోనస్, రైతు కూలీలకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
ఫ చీము, నెత్తురు ఉంటే నాతో రండి..
- పెద్దపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే విజయరమణారావు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో విమర్శిస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు దమ్ముంటే, చీము, నెత్తురు ఉంటే పెద్దపల్లికి రావాలని, ఏ కేంద్రానికైనా వెళ్లి కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయో రైతులను తెలుసుకుం దామని ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. గతంలో ధాన్యం కొనుగోలు పేరుతో రైతులకు చాలా నష్టం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంవత్సరానికి దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లాలో గత పాలకుల హయాంలో లక్షా 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ప్రస్తుతం 2 లక్షల 90 వేల టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేశామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని తెలిపారు. ఇందుకు కృషి చేసిన కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. కొందరు పొద్దెరగని బిచ్చగాళ్లు గత ప్రభుత్వం విస్మరించిన పేదలకు నేడు ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.
ఫ రామగుండంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి
- ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
రామగుండంలో ఒక మండలం, ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కోరారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నారని తెలిపారు. రామగుండం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నగరానికి అదనంగా మరో తహసీల్దార్ కార్యాలయం మం జూరు చేయాలని, అంతర్గాం కాందిశీకులు సమస్య పరిష్కరించాలని, జెన్కో సింగరేణి తరపున గతంలో 18 వేల పట్టాలు పంపిణీ చేశామని, మరో 15వేల పట్టాలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.