భూ భారతి చట్టం.. రైతులకు చుట్టం..
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:11 AM
భూ భారతి చట్టం రైతులకు చుట్టమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : భూ భారతి చట్టం రైతులకు చుట్టమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025పై అవగాహన సద స్సును కోనరావుపేట మండలం నిజామాబాద్‌లోని రైతు వేదికలో నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై మాట్లాడా రు. కలెక్టర్ ఈ సందర్భంగా భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. భూ భారతి చట్టం ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రుల సమక్షంలో చట్టం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. కొన్ని రోజులుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమక్షం లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా యాజమాన్య హక్కులు ఉన్న గాని వాటిని మనం పొందలేక పోయామని పేర్కొన్నారు. గతంలో అసైన్‌మెంట్ కమిటీ ఉండేదని, ధరణి చట్టంతో దానిని తొలగించా రని వివరించారు. ధరణి చట్టానికి సరైన ప్రణా ళికలు లేకుండా రూపొందించాలని విమర్శించా రు. తాత ముత్తాతలు కొన్న భూములను ధరణి వల్ల మళ్లీ పాత వాళ్ళకే పట్టా ఉండటంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. పేద వారికి ఉపయోగపడే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసింది తమ ప్రభుత్వ మని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంలో మహి ళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, 500లకే సిలిండర్లు సరఫరా చేస్తున్నా మన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. రైతు లకు ఏక కాలంలో 2లక్షల వరకు రుణమాఫీ చేశామని, దశాబ్దాల కల ఎస్సి వర్గీకరణ అమలు చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా కొన్ని కార్యక్రమాలను అమలు చేసుకోవాల్సి ఉందని, త్వరలోనే వాటిని కూడా అమలు చేస్తామని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నామని వివరించారు. దీని ద్వారా సుమారు 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతు ను రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లప ల్లి ప్రభాకర్, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, తహసిల్దార్ వర లక్ష్మి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చందన గిరి గోపాల్, గొట్టే రుక్మిణి, కాంగ్రెస్ నాయకులు పెంతల శ్రీనివాస్, మానుక సత్యం, నాలుక సత్యం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయిని ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింబయ్య, వెంగళ వెంక న్న తదితరులు పాల్గొన్నారు.