Share News

జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన బోధన

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:34 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన బోధన అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన బోధన

సిరిసిల్ల టౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మెరుగైన బోధన అందించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమీకృత కార్యాలయం మినీ సమావేశం మందిరంలో కలెక్టర్‌ ఇంటర్‌ విద్యపై ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమీక్షను నిర్వహిం చారు. జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల ఎనరోల్‌ మెంట్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు జూనియర్‌ కళాశాలలో మైనర్‌ రిపేర్లు, విద్యా ర్థుల సంక్షేమ కార్యక్రమాలు పోటీ పరీక్షల శిక్షణ, ఫైర్‌ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల పరిధిలో మొదటి సంవత్సరం 1777 అడ్మిషన్లు సాధిం చడం లక్ష్యం కాగా, 63 శాతం అంటే 1116 మంది విద్యార్థులు ఎనరోల్‌ చేసుకున్నారన్నారు. జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్స్‌ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జూనియర్‌ కళాశా లలో సివిల్‌ వర్క్‌, విద్యుత్‌ సరఫరా, పారిశుధ్యం, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పన మైనర్‌ రిపేర్‌ పనులకు ప్రభుత్వం రూపాయాలు కోటి 80 లక్షలు మంజూరు చేసిందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ కళాశాలలో మరమ్మతులు చేయించాలన్నారు. జూనియర్‌ కళాశాలలో అందించే విద్య నాణ్యత పెరగాలని అధ్యాపకులు సకాలంలో కళాశాలలకు హాజరు కావాలని అన్నారు. విద్యార్థులకు అర్థమయే రీతిలో బోధన జరగాలని పేర్కొ న్నారు. 2024 - 25 విద్యా సంవత్సరంలో సప్లమెంటరీ పరీక్షలు మగిసిన తర్వాత వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట కళా శాలలో ఫలితాలు చాలా తక్కువగా వచ్చాయన్నారు. జిల్లాలో ఇంటర్‌ విద్య చాలా వెనకబడిందని, మౌలిక వసతుల కల్పన పనులు, ఫరీక్ష ఫలితాల్లో చాలా మెరుగు పడాలని సూచించారు. జూనియర్‌ కళాశాల విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి జూనియర్‌ కళాశాలలో రెగ్యులర్‌గా స్టూడెంట్‌ కౌన్సిలర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. జూనియర్‌ కళాశాలలో యాంటీ డ్రగ్స్‌ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో విద్యా ర్థులకు డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల కోసం అందించిన ప్రత్యేక శిక్షణతో మంచి ఫలితాలు సాధించామని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలన్నారు. విద్యార్థులదరికి పాఠ్యపుస్తకాలు, ఇతర పోటీ పరీక్షల పుస్తకాలు సకాలంలో అందిం చాలన్నారు. కళాశాలలో క్రీడలకు అవసరమైన చర్యలు తీసు కోవాలని అందుకోసం టెన్నిస్‌ కోర్టు, టేబుల్‌ టెన్నిస్‌, క్యారం, చెస్‌ బోర్డులు ఉండేలా ఏర్పాట్లు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రామాల నుంచి విద్యార్థులు కళాశాలలకు వచ్చే రూట్లలో బస్సులు నడిపే విధంగా ప్రతిపాదనలు అందిం చాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్‌ బోర్డు నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:34 AM