మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:44 PM
ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ వో హరీష్‌రాజ్ అన్నారు.
భీమిని, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ వో హరీష్‌రాజ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తగు జాగ్రత్తలు అందించాలన్నారు. ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక దృష్టి నిలిపిందని, దవాఖానాల్లో సౌకర్యాలు కల్పిచడంతో పాటు సేవలను విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. విధుల్లో సమయపాలన పాటించాలని, విధుల కు సక్రమంగా హాజరై, సిబ్బంది విధులకు సమయపాలన పాటించాలని, ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరగాలని, గ్రామాల్లో సబ్ సెంటర్లను విధిగా ప్రతీ రోజూ తెరవాలని, చక్కటి ప్రణాళికలతో గ్రామీణులకు వైద్య సేవలు అందించాలని సూచించారు. ఫిర్యాదులు వస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రికార్డులను పరిసరాలను పరిశీలిం చారు. అనంతరం సిబ్బందికి ఫిజియోథెరపీపై ట్రైనింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి ప్రసాద్, వైద్యులు అనిల్ కుమా ర్, సీహెచ్‌వోలు పుట్ట సత్తయ్య, జలపతి, హెచ్‌ఈవో శ్రీనివాస్, హెచ్‌వీ ఇందిర, హెచ్‌ఏలు ఉమాశంకర్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.