Share News

పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:01 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు వాటిని సధ్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు.

 పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు
వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ పమేలా సత్పతి.

- కలెక్టర్‌ పమేలా సత్పతి

మానకొండూర్‌, అక్టోబరు 21 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు వాటిని సధ్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని వెల్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ల్యాబ్‌, మెడిసిన్‌ స్టోర్‌, వ్యాక్సిన్లు నిల్వ చేసే గది, లేబరు రూం, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలోని పలు రిజిష్టర్లతోపాటు ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్‌ సాయిప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ, వైద్య పరీక్షల వివరాలతోపాటు వంద శాతం మందికి వైద్య పరీక్షలు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. స్ర్కీనింగ్‌ పూర్తి అయి ఆరు నెలలు గడిచిన మహిళలకు మరో విడత వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయించుకునేలా గర్భీణులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. బీపి షుగర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రతి నెలా ఉచితంగా మందులను పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని వారికి తెలియజేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సనా, వైద్యులు సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 12:01 AM