Share News

పేద ప్రజలకు మెరుగైన వైద్యం..

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:31 AM

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కు మెరుగైన వైద్యం అందించ కృతనిశ్చయంతో ముందుకు వెళుతందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పేద ప్రజలకు మెరుగైన వైద్యం..

వేములవాడ టౌన్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కు మెరుగైన వైద్యం అందించ కృతనిశ్చయంతో ముందుకు వెళుతందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ వివిధ రకాలుగా సమాజిక సేవ చేస్తుందని కొనియాడారు. వైద్య శిబిరానికి వచ్చిన వారిని పరీక్షించి వారికి తగిన మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైన ఎప్పుడు విపత్తులు సంభవించిన క్లబ్‌ ముందుంటుందని అన్నారు. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని వివరించారు. ప్రైవేటు రంగం వారు కూడా పేదవారికి సహకారం అందించాలని సూచించారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2025 | 12:31 AM