పేద విద్యార్థులకు మెరుగైన విద్య
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:44 AM
పేద విద్యార్థుల కు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థుల కు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి రూ.9.20 కోట్ల మహిళ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటిసారిగా డిగ్రీ కళాశాలను సందర్శించిన సంద ర్భంగా హాస్టల్‌వసతి లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బంరులను గమనించి సీఎం దృష్టికి తీసుకవెళ్లానన్నారు. విద్యపై ప్రభుత్వాని కి ఉన్న ప్రాముఖ్యత, పేదలు చదువుకునే పాఠశాలలు, కళాశాల లు, రెసిడెన్సియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్న పేపథ్యంలో ప్రభుత్వం హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. 2005లో అగ్రహారం డిగ్రీ కళాశాల లో సైన్స్ వింగ్ ఏర్పాటు కోసం అప్పటి సీఎం వైఎస్ రాజాశేఖర్‌రెడ్డి సహకారంతో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. హాస్టల్ వసతి కారణం గా ఎక్కువ మంది బాలికలు ఉన్నత చదువులు చదవుకుంటారని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ విద్యార్థులు చదువుకునే పేద పిల్లల కోసం ప్రజా ప్రభుత్వం 40శాతం డైట్ చార్జీలు, 200శాతం కాస్మెటిక్ చార్జీలు పెంచామన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో కామన్ డైట్ మెన్యూ ప్రవేశపెట్టామన్నారు. నూతనంగా 11 వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించామన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు పదో న్నతులు పారదర్శకంగా చేశామన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నామని, ఐటీఐ కళాశాలను రతన్ టాటా కంపెనీతో అనుసంధానం చేసుకుని అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్లుగా మారు స్తున్నామని తెలిపారు. రూ. 200 కోట్లు ఖర్చు చేసి 20 నుంచి 25 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణ పను లు ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. వేదాలకు సంబంధించిన ఆల్ ఇండియా పరీక్షలు రాజన్న ఆలయంలో నిర్వహించామని, భవిష్యత్తు లో మరిన్ని విద్యా సంస్థలను వేములవాడ ప్రాంతంలో ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని హామీచ్చారు. కలెక్టర్ సందీప్‌కుమార్ మాట్లాడుతూ నాగ పంచమి రోజు పీఎం ఉష పథకం క్రింద రూ.9 కోట్ల 20 లక్షలతో అగ్రహారం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద హాస్టల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. 18 నెలల్లోనే భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థిను లకు అందుబాటులోకి తీసకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అధ్యాపకులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.