బీడీ కార్మికులకు రావాల్సిన వేతనాలు అందించాలి
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:27 AM
ఠాకూర్ సౌదేఖర్ బీడీ కంపెనీలో పనిచేస్తున్న బీడి కార్మికులకు రావాల్సిన వేతనాలను ఇప్పించాలని సీఐటీయూ బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షడు మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : ఠాకూర్ సౌదేఖర్ బీడీ కంపెనీలో పనిచేస్తున్న బీడి కార్మికులకు రావాల్సిన వేతనాలను ఇప్పించాలని సీఐటీయూ బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షడు మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్ లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ మాట్లాడుతూ ఈ బీడీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు గత అరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఆరునెలలుగా కూలీ డబ్బులు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నా రు. కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను పోషించు కునే పరిస్థితి ఏర్పడిందన్నారు. చేసిన అప్పులకు మిత్త కట్టలేక బీడీ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచే యడంతో పాటు శ్రమదోపిడీకి గురిచేస్తున్నారన్నారు. కంపెనీల కిరాయి కూడా కార్మికుల వేతనాలను నుంచి వసూలు చేస్తున్నారని ఆరో పించారు. ఇలాంటి బీడీ కంపెనీ యాజమాన్యంపై కార్మిక శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్‌కు ఫిర్యా దులు చేస్తామన్నారు. ఇప్ప టికైనా సంబంధిత అధికారు లు స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో బీడీ కార్మి క సంఘం నాయకులు సూరం పద్మ, శ్రీరాముల రమేష్‌చంద్ర, జిందం కమలా కర్ తదితరులు పాల్గొన్నారు.