Share News

విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:29 AM

ముందస్తు అప్రమత్తత ద్వారా విప త్కర సమయాల్లో ప్రాణనష్టాలు తగ్గించువ చ్చునని, వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు.

విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 19 (ఆంధ్ర జ్యోతి) : ముందస్తు అప్రమత్తత ద్వారా విప త్కర సమయాల్లో ప్రాణనష్టాలు తగ్గించువ చ్చునని, వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. విపత్తుల నిర్వహణ మాక్‌ డ్రిల్‌ను ఈనెల 22న విజయవంతం చేయాలన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో విపత్తుల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల22న విపత్తుల నిర్వహణ మాక్‌ ఎక్సర్ట్సైజ్‌ను విజయ వంతంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన అన్ని సాధనాలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వైపరీ త్యాల సమయంలో ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పని చేయాలని పేర్కోన్నారు. వర్షపాతం,ప్రాజెక్టుల నీటి మట్టం, నీరు విడుదల, వంతేనలు, రోడ్లస్థితి వంటి అంశాల రియల్‌ టైమ్‌ సమాచారం ప్రజలకు చేరవేయాలని సూచించారు. అత్య వసర సమయాల్లో ప్రజలకు అవసరమగు అన్నిసేవల టోల్‌ఫ్రీ నంబరుల సమాచారం ప్రజలందరికి తెలిసేలా చర్యలు తీసుకో వాలని తెలిపారు. పారిశుద్య నిర్వహణ, వైద్యసేవలు, అనేవి వైపరీత్యాల సమయంలో అత్యంత కీలకమని అన్నారు. ఎన్డీఆర్‌ ఎఫ్‌ బృందాలకు సహకారం అందిస్తాయన్నారు. అత్యవసర సమయంలో హెలికాప్టర్‌ సేవలు వినియోగించుకోవచ్చునని అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో లు వెంకటేశ్వర్లు, రాధాబాయి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:30 AM