Share News

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:59 PM

సీజనల్‌ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో జాగీర్‌పల్లికి సుస్తీ అనే వార్త ప్రచురితం కావడంతో అప్రమత్తమైన డీఎంహెచ్‌ వో జాగీర్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో తిరిగి పారిశుధ్య పనులను పరిశీలించారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జాగీర్‌పల్లిలో జ్వరపీడుతుల ఇంటికి వెళ్లి రిపోర్ట్‌లు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ వో వెంకటరమణ

సైదాపూర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో జాగీర్‌పల్లికి సుస్తీ అనే వార్త ప్రచురితం కావడంతో అప్రమత్తమైన డీఎంహెచ్‌ వో జాగీర్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో తిరిగి పారిశుధ్య పనులను పరిశీలించారు. డెంగ్యూ పాజిటివ్‌ వచ్చిన చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ డెంగ్యూ లక్షణాలున్న వారికి ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయొద్దన్నారు. అటువంటి వారిని జిల్లా ఆసుపత్రికి పంపాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే డెంగ్యూ పాజిటివ్‌ నిర్ధారణ చేస్తారని తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో డెంగ్యూ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాగీర్‌పల్లి వీఽధులను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామంలో ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగుతూ జ్వర సర్వే చేయాలని ఆదేశించారు. ప్రతీ మంగళ, శుక్రవాం డ్రైడే పాటించాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్లు వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం సైదాపూర్‌ పీహెచ్‌సీని సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌ వో డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, డాక్టర్‌ కృష్ణారావు, జిల్లా హెల్త్‌ ఎడ్యూకేటర్‌ పంచాల ప్రతాప్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్యామ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్లు రమేష్‌, జయప్రద రాణి పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:59 PM