సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 25 , 2025 | 12:42 AM
వర్షాకాలం ప్రారంభం అవుతు న్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యా ధికారి డాక్టర్ రజిత సూచించారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మే 24 (ఆంధ్రజ్యోతి) : వర్షాకాలం ప్రారంభం అవుతు న్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యా ధికారి డాక్టర్ రజిత సూచించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని వైద్య అరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం సీజనల్ వ్యాధులపై జిల్లా ప్రాథమిక అరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో సీజనల్ వ్యాధుల నివారణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రబలే వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేం దుకు ముందు జాగ్రత్తగా రక్త నమూనాలను సేకరించి ఆర్‌డీటీ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లలో ఐఆర్‌ఎస్‌ను స్ర్పే చేయించడం, ఇంటి అవరణలోని తొట్టెల్లో టైర్లలో, కూలర్లలో నీటి నిల్వలు లేకుండా ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డేను పాటించి దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి రోజు రోజువారీ వివరాలను జిల్లా వైద్య అరోగ్య శాఖ కార్యాలయంలో అందించాలని అదేశించారు. ఈ సమావేశంలో వైద్యాధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.