నిరంతర ఉద్యమాలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:57 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండాలన్నీ ఏకమై నిరంతర ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార జాతా సోమవారం కరీంనగర్‌కు చేరుకుంది.
గణేశ్‌నగర్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఎర్రజెండాలన్నీ ఏకమై నిరంతర ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ వందేళ్ళ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార జాతా సోమవారం కరీంనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలతో ముందుకు పోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కలవేన శంకర్ తదితరులు పాల్గొన్నారు.