అప్రమత్తంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:37 AM
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా వ్యవహ రించాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
వేములవాడ రూరల్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద సిబ్బంది అప్రమత్తంగా వ్యవహ రించాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఫాజుల్‌నగర్ వద్ద ఏర్పాటుచేసిన ఎన్‌ఎస్‌టీ చెక్‌పోస్టును ఆదివా రం ఆమె తనిఖీ చేసారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం వాహనాల తనిఖీ రిజిస్టర్‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూరల్ సీఐ శ్రీనివాస్, పలువురు అధికారులు ఉన్నారు.