అతి భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:47 AM
అతి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అతి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రు లు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్‌లోని తెలం గాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని, ఆకస్మిక వరదల సమయంలో ప్రజల ప్రాణాల రక్షణకు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు హెలికాప్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం ఖమ్మంలో ఎదురైన ఇబ్బందులు మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వరద సహాయక చర్యలకు కలెక్టర్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందని, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాం తాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన వైద్యం, ఆహారం ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. వరదల గురించి ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో, ఎఫ్‌ఎం రేడియో, వివిధ మాధ్య మాల ద్వారా ముందస్తు సమాచారం అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిడుగుపాటుకు మృతిచెందే పశువులకు ఎఫ్‌ఐఆర్ సమో దు చేయకపోవడం వల్ల సహాయం చేయలేకపోతున్నామని, పోలీస్ అధికారులకు సమాచారం అందించి వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. వరదల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉం డాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిం చాలన్నారు. అత్యవసర సమయాల్లో పిర్యాదు చేసేందుకు కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీనంబర్ 9398684240 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి భారీ వర్షాలతో తీసుకోవాల్సిన చర్యలు, తీసుకుంటున్న చర్యలను వివరించారు.