Share News

బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి..

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:59 AM

బీసీల ఐక్యత ద్వారానే అన్ని రంగాల్లో ముందుకు వెళుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఈడ్గురాళ్ల సురేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు.

బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి..

ముస్తాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : బీసీల ఐక్యత ద్వారానే అన్ని రంగాల్లో ముందుకు వెళుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఈడ్గురాళ్ల సురేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జీకె ఫంక్షన్‌ హాల్‌లో సురేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిం చారు. ఈసందర్భంగా అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి విచ్చేసిన బీసీ నాయకులను శాలువతో సత్కరించి మెమొంటో అందించి సన్మానం చేశారు. బీసీలంతా ఐక్యతతో ఉద్యమిస్తేనే హక్కులు సాధిస్తామని లేదంటే మన భవిష్యత్‌ తరాలకు అన్యాయం చేసిన వారమవుతామని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీసీలంతా కలిసి ఐక్యతతో ఉద్యమించాలన్నారు. అగ్రవర్నాల తాయిలాలలకు తలొగ్గ వద్దని సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈబీసీ పేరుతో బీసీలకు వచ్చే ఉద్యోగాలను అగ్ర వర్ణాలకు కట్టబెట్టిందని... ఇలా అన్యాయం జరిగితే బీసీ వర్గాలు మరింత పేదరికంలో వెళ్లడం ఖాయమన్నారు. బీసీ వర్గాలు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు రాజ కీయ రంగాల్లో రాణిస్తేనే న్యాయం జరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారి దత్తాత్రేయ ఆధ్వర్యంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో 2009లో ప్రారంభమైన అలయ్‌ బలయ్‌ ముస్తాబాద్‌లో కూడా మొదటిసారిగా జరుగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ జెల్ల వెంకటస్వామి, బీసీ టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్‌గౌడ్‌, జిల్లా మాజీ అధ్యక్షులు కొండ యాదగిరిగౌడ్‌, మాజీ ఎంపీటీసీలు గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్‌, బీసీటీఏలు బండారి మల్లేశం, విక్కుర్తి లక్ష్మీనా రాయణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకాల శ్రీకాంత్‌, సత్తయ్యగౌడ్‌, చెవుల మల్లేశం, తుమ్మ రాజేందర్‌, పెంజర్ల బాలెల్లం, కోల కృష్న, పులి రామ్‌గోపాల్‌, ప్రవీణ్‌ తాటికొండ కృష్నహరి, వేముల సత్యనారాయణ, ప్రశంత్‌గౌడ్‌, కుంట శ్రీనివాస్‌ మహిళా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 12:59 AM