Share News

బీసీ రిజర్వేషన్లు చట్టపరంగా అమలు చేయాలి..

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:17 AM

బీసీల 42 శాతం రిజర్వే షన్లు పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా రిజర్వేషన్లు అమలుచేయాలని బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షహన్మాండ్లు అన్నా రు.

బీసీ రిజర్వేషన్లు చట్టపరంగా అమలు చేయాలి..

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : బీసీల 42 శాతం రిజర్వే షన్లు పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా రిజర్వేషన్లు అమలుచేయాలని బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షహన్మాండ్లు అన్నా రు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్లమెం ట్‌లో బీసీ బిల్లు పెట్టి తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ గురువారం జిల్లా కేంద్రం అంబే ద్కర్‌ చౌరస్తాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పర్శహనాండ్లు మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయడంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నారని దానికి అనుగుణంగా బీసీ కులగణన చేసి అసెంబ్లీలో బీసీ బిల్లును తీర్మానం చేసి గవర్నర్‌, రాష్ట్రపతికి పంపించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టు సడలకుండా బీసీల రిజర్వేషన్లు సాధించే వరకు పట్టుదలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు తడకు కమలాకర్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, కుమ్మరి శాలి వాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రాధారపు శంక ర్‌గౌడ్‌, మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రతినిధి బండారి బాల్‌రెడ్డి, గౌడ సంఘం జిల్లా ప్రతినిధి కందుకూరి రామాగౌడ్‌, యాదవ సంఘం జిల్లా ప్రతినిధి రాములు, రజక సంఘం జిల్లా ప్రతినిధి కంచర్ల రాజు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రతి నిధి తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:17 AM