Share News

బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:05 AM

బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్‌ అంబేద్కర్‌ చౌక్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం చేసి వెంటనే కేంద్రం అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆఽధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు.

బీసీ రిజర్వేషన్లు అమలు  చేయాలి
అంబేద్కర్‌ చౌక్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

భగత్‌నగర్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్‌ అంబేద్కర్‌ చౌక్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం చేసి వెంటనే కేంద్రం అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆఽధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేయకుండా రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నదన్నారు. బీసీ రిజర్వేషన్లపై సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తున్నదన్నారు. కార్యక్రమంలో గుడికందుల సత్యం, భీమాసాహెబ్‌, కోనేటి నాగమణి, తిప్పారపు సురేష్‌, గజ్జల శ్రీకాంత్‌, పుల్లెల మల్లయ్య, సాగర్‌, కండె రాజు, సాయికుమార్‌, శ్రీనివాస్‌, సందేశ్‌, ఇస్సాక్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:05 AM