Share News

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ నాయకుల నిరసన

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:19 AM

పంచాయతీ ఎన్నికలు పార్టీపరంగా రిజర్వేషన్‌లతో జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నేతలు శుక్రవారం నిరసన తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ నాయకుల నిరసన

వేములవాడ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు పార్టీపరంగా రిజర్వేషన్‌లతో జరపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘం నేతలు శుక్రవారం నిరసన తెలిపారు. వేములవాడ పట్టణంలోని బీసీ సంఘం కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిబాపూలే చిత్రపటాలకు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్‌లను ఉపసంహరించుకోవాలని, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్‌, బీసీ సంఘం నేతలు నేరేళ్ల తిరుమల్‌ గౌడ్‌, తుపుకారి సత్తయ్య, వెంకటేష్‌, కడారి రాములు, చింతలకోటి రామస్వామి, మారం కుమార్‌, దేవయ్య, భూమయ్య, దశగౌడ్‌, చంద్రకాంత్‌, రమణ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:19 AM