Share News

బీసీ బంద్‌ విజయవంతం

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:26 AM

బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం విజయ వంతమైంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగా లన్నీ బంద్‌ పాటించాయి.

బీసీ బంద్‌ విజయవంతం
జగిత్యాలలో మూసి ఉన్న దుకాణాలు

- జిల్లావ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు

- ముందస్తుగానే ప్రైవేట్‌ విద్యాసంస్థల సెలవు

- ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్‌,

- బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్ష నేతలు

బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం విజయ వంతమైంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగా లన్నీ బంద్‌ పాటించాయి. పలు చోట్ల నాయకులు, నిరసనలు, ర్యాలీలు చేశారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ బంద్‌ కు మద్దతు ప్రకటించింది. జిల్లాలో ప్రధాన పట్టణాలైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి పట్టణాల తో పాటు మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచా యతీ ల్లో వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచి పోయా యి. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లలేదు. మరోవైపు దీపావళి పండుగ తో పాటు వారంతపు సెలవులు ఉండడంతో వివిధ ప్రాం తాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. గంటల తరబడి బస్‌ స్టేషన్లలో వేచి ఉన్నారు.

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వ హించిన బంద్‌ జిల్లా కేంద్రంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు బారీ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల పద్మశాలి సం ఘం ఆధ్వర్యంలో రాట్నంతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు డప్పులతో మద్దతు తెలిపా రు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, గాజం గి నందయ్య, బండ శంకర్‌, బీసీ ఐక్యవేదిక నాయకు లు హరి అశోక్‌ కుమార్‌, అడువాల లక్ష్మణ్‌, వీరబత్తి ని శ్రీనివాస్‌, ఆకుబత్తిని శ్రీనివాస్‌, కొక్కు గంగాధర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు దూమాల గంగారాం, దువ్వాక శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:26 AM