టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:13 AM
టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల ఉద్యోగినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకవచ్చారు. ఆటా పాటలు, కోలాట, దాండియా నృత్యాలతో సందడి చేశారు.
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల ఉద్యోగినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి తీసుకవచ్చారు. ఆటా పాటలు, కోలాట, దాండియా నృత్యాలతో సందడి చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలాసత్పతి, అతిథులుగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ హాజరయ్యారు. ఉద్యోగులకు, నగర ప్రజలకు ముందస్తు బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ నేతృత్వంలో వివిధ ఆలయాల నుంచి వచ్చిన అర్చకులు అతిథులకు ఆశీర్వచనం చేయగా టీఎన్‌జీవో బాధ్యులు జ్ఞాపికలు, శాలువాలతో సత్కరించారు. బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మహిళా ఉద్యోగులతో కలసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంగెం లక్ష్మణరావు, టౌన్ ప్రెసిడెంట్ రాజేశ్ భరద్వాజ్, నరసింహస్వామి, ప్రభాకర్‌రెడ్డి, రాగి శ్రీనివాస్, హర్మిందర్‌సింగ్, రవిందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కాళీచరణ్, రామస్వామి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో..
కరీంనగర్ రెవెన్యూ గార్డెన్‌లో శుక్రవారం మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అతిథులుగా కలెక్టర్ పమేలాసత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాఖడే, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ హాజరయ్యారు.