బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:39 PM
నగరంలోని మహాత్మా జ్యోతీబాఫూలే మైదానంలో బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మహాత్మా జ్యోతీబాఫూలే మైదానంలో బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ పాలనలో బతుకమ్మకు ఎంతో విలువ ఉండేదని అన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవేవీ లేవని అన్నారు. ప్రభుత్వ పక్షాన వేడుకలు ఘనంగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. పూర్వపు రోజులు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతీరాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్ వాల రమణారావు పాల్గొన్నారు.