Share News

మూడో రోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:13 AM

వేములవా డ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బతుకమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

మూడో రోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు

వేములవాడ కల్చరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వేములవా డ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బతుకమ్మ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మను పురష్కరించుకుని పట్టణవాసులు బతుకమ్మలను తీసుకుని ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయంలో విద్యుత్‌ దీపాల వెలుగుల్లో భక్తులు బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భక్తులు రాజన్న ఆలయ ధర్మగుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వెంట తీసుకువచ్చిన ఫలహారాన్ని ఇచ్చిపుచ్చుకు న్నారు. కాగా రాజన్న ఆలయానికి వచ్చిన మహిళతో కలిసి రాజన్న ఆలయ ఈవో రమాదేవి బతుకమ్మ వేడుకల్లో పాల్గొ ని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 12:13 AM