రాజన్న ఆలయంలో బతుకమ్మ వేడుకలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:59 PM
వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో రెండవ రోజు బతుక మ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.
వేములవాడ కల్చరల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో రెండవ రోజు బతుక మ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా రెండవ రోజు మహిళలు బతుకమ్మలను పేర్చుకుని ఆల యానికి తరిలివచ్చారు. రాజన్న ఆలయంలో బతుకమ్మలను నిలిపి పాటులు పాడుతూ నృత్యాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాజన్న ఆలయ ధర్మగుండంలో బతుకమ్మలను నిమజ్జ నం చేశారు. అనంతరం సిబ్బిలో వెంట తీసుకువచ్చిన అటుకులు, బెల్లం ఫలహారాలను ఇచ్చిపుచ్చుకున్నారు. విద్యుత్ వెలుగుల్లో ఆడిన బతుకమ్మ ఆటలు ఆకట్టుకున్నాయి.