Share News

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:34 AM

ధర్మపురి క్షేత్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా క్షేత్రంలోని మున్సిపాలిటీ, వివిధ వీధుల్లో, కోనేరు వద్ద అనేక మంది మహిళలు, యువతులు, చిన్నపిల్లలు సాంప్రదా య రీతిలో తెలంగాణ జానపద, బతుకమ్మ, గౌరీ దేవి పాటలుపాడుతూ ఆటలు ఆడారు.

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..
మల్యాల మండలం రాంపూర్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

- బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

ధర్మపురి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా క్షేత్రంలోని మున్సిపాలిటీ, వివిధ వీధుల్లో, కోనేరు వద్ద అనేక మంది మహిళలు, యువతులు, చిన్నపిల్లలు సాంప్రదా య రీతిలో తెలంగాణ జానపద, బతుకమ్మ, గౌరీ దేవి పాటలుపాడుతూ ఆటలు ఆడారు. రాత్రి వేళలో బతుక మ్మలను వాడలో ఏర్పాటు చేసిన గుంతలు, కోనేరు, గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. స్థానిక మున్సిపాలి టీ వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి బతుకమ్మ ఉత్సవా లు నిర్వహించారు. మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ సహా, మాజీ మహిళా కౌన్సిలర్లు, రిసోర్స్‌ పర్సన్లు ఒకే రకం చీరెలు ధరించి బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ వీధుల్లో, కోనేరు, గోదావరి నది వద్ద విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనన్‌ మామిళ్ల శ్రీనివాస్‌రావు, మేనేజర్‌ బాలె గంగాధర్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ చిట్యాల గంగాధర్‌, సిబ్బంది పర్యవేక్షించారు.

బతుకమ్మ పండుగ ఆత్మగౌరవ ప్రతీక

తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను ఆత్మగౌ రవ ప్రతీకగా భావిస్తారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవా లను ఆదివారం రాత్రి ఆయన తిల కించి మాట్లాడారు. బతుక మ్మ చీరెలు మహిళా సంఘాల సభ్యులకే ఇవ్వాలని నిర్ణయించగా మంత్రివర్గం నుంచి తామం దరం ప్రతీ ఒక్క మహిళలకు చీరె అందించాలని సూచించిన ట్లు ఆయన అన్నారు. ధర్మపురి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ జక్కు రవీందర్‌, టీపీసీసీ సభ్యుడు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ చిలుముల లావణ్య, మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేష్‌ పాల్గొన్నారు.

జగిత్యాలరూరల్‌: మండలంలోని ఎంపీడీవో కార్యా లయంలో అన్ని గ్రామాల పంచాయితీ కార్యదర్శులు, కార్యాల య సిబ్బంది బతుకమ్మను ఆడారు. కార్యక్ర మంలో ఎం పీవో రవిబాబు, పంచాయితీకార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

మల్యాల: మండలంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభం అయ్యాయి. రాంపూర్‌ గ్రామంలో మాజీ సర్పంచ్‌ బద్దం తిరుప తిరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. మహిళలు పెద్ద ఎత్తు న తరలివచ్చి బతుకమ్మ ఆడారు.

రాయికల్‌: రాయికల్‌ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఇటిక్యాల పద్మశాలి సంఘ భవనంలో వేడుక లు ఘనంగా జరిగాయి. మాజీ సర్పంచ్‌ సామల లావణ్యవేణు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

కోరుట్ల/కొడిమ్యాల/వెల్గటూర్‌: కోరుట్ల పట్టణం, కొడిమ్యా ల, వెల్గటూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రూపంలో మహిళలు గౌరమ్మను కొలిచారు.

Updated Date - Sep 22 , 2025 | 12:34 AM