ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:56 PM
బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బుధవారం బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హాజ రయ్యారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బుధవారం బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హాజ రయ్యారు. ముందుగా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. సిరిసిల్ల ఆర్డీవో రాధాబా యి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రా వు, డీఆర్డీవో శేషాద్రి, కుల సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.