బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల వార్షికోత్సవం
ABN , Publish Date - May 10 , 2025 | 12:24 AM
తంగళ్లపల్లి మండలం జిల్లె ల్ల గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల వార్షి కోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.

తంగళ్లపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): తంగళ్లపల్లి మండలం జిల్లె ల్ల గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల వార్షి కోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమా నికి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, రామయ్యపేట రైతు ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్ శ్దేవ్‌రావు, సైనోవిట ఫార్మర్ సొల్యూ షన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దేశా న్ని పోషిస్తున్నారన్నారు. విద్యార్థులు గురువులను గౌరవిస్తూ, మానసిక దృఢత్వంతో ముందుకు సాగాలని సూచించారు. రైతు లు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని అన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కె.బి సునీతా దేవి కళాశాల విజయాలు, రాబోయే రోజుల్లో చేయవలసిన ప్రణాళికలు తదితర అంశాలను వివరించారు. అలాగే కళాశాల మ్యాగజైన్ ఆవిష్కరించారు. కళాశాల దత్తత గ్రామం రాళ్ళపేట ఆదర్శ రైతులను సన్మానించారు. అనంతరం వివిధ ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఆటపాటతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి స్వాగత ఉపన్యాసం డాక్టర్ భవ్యశ్రీ ఇవ్వగా, కళాశాల ఓఐఎస్‌ఏ డాక్టర్ రమేష్ కార్యక్రమానికి హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపారు.